- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాటలకే మహిళా సాధికారత… ఆచరణలో నిర్లక్ష్యం
మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాజంలో వారి పాత్రను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

దిశ, రేవల్లి : మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాజంలో వారి పాత్రను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం పథకాలు ప్రకటిస్తూ.. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ రేవల్లి లో మండల స్థాయి అధికారులంతా మహిళలే ఉన్నప్పటికీ.. మహిళా దినోత్సవానికి మంగళం పాడారు. మహిళా దినోత్సవం ఆదివారం వచ్చినప్పటికీ సోమవారం కూడా ఎలాంటి కార్యక్రమం నిర్వహించకపోవడం మండల పరిపాలనపై తీవ్రమైన విమర్శలకు దారి తీస్తున్నాయి. మహిళల గౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రత్యేక దినాన్ని గుర్తించి మహిళా అవగాహన ర్యాలీలు గ్రామ సభలో సమావేశం, మహిళల హక్కులు, మంచి సేవ చేసిన మహిళలను,మహిళల రైతులకు సన్మానం గ్రామంలో మహిళల ఆరోగ్య పరీక్షలు గర్భిణీ మహిళలకు పరీక్షలు, క్రీడలు & సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేస్తుంటారు.
రేవల్లి మండలంలో కనీసం అవగాహన సమావేశం నిర్వహించకుండ అధికారులు పూర్తిగా మౌనం వహించడం స్థానిక ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది.మహిళా సాధికారతపై పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే రాజకీయ నాయకులు, అధికారులు ఆచరణలో మాత్రం ఈ దినోత్సవాన్ని విస్మరించడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ప్రేరణ కలిగించే కార్యక్రమాలు నిర్వహించాల్సిన సమయంలో మండల పరిపాలనలోని అధికారుల మౌనం ఎందుకో అని మండల మహిళా లోకం ప్రశ్నిస్తుంది. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళల ఆరోగ్యం, ఉపాధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా నిర్లక్ష్యం ప్రదర్శించడం సమాజంలో ప్రతికూల సందేశం ఇస్తోందని స్థానిక మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఈ నిర్లక్ష్యంపై వివరణ తీసుకుని మహిళల గౌరవాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






