మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : మహిళా సాధికార కేంద్రం సిబ్బంది సుమ

by Ratna Kumari |

మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని మహిళా సాధికార కేంద్రం సిబ్బంది సుమ పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని కిష్టగిరి గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : మహిళా సాధికార కేంద్రం సిబ్బంది సుమ
X

దిశ, క్రైమ్/వనపర్తి : మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని మహిళా సాధికార కేంద్రం సిబ్బంది సుమ పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని కిష్టగిరి గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


మహిళలు దేశ నిర్మాణంలో సమాన భాగస్వాములుగా ఎదగాలంటే సామాజిక, ఆర్థిక బలోపేతం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఆర్థిక మోసాల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పూర్తి ఆర్థిక అక్షరాస్యత సాధించాలని కోరారు. అలాగే సైబర్ క్రైమ్, బాలల చట్టాలు, చైల్డ్ లేబర్, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలల సహాయానికి 1098, సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, మహిళల గృహహింస సహాయానికి 181, పోలీస్ సహాయానికి 100, వయోవృద్ధుల సహాయానికి 14567 టోల్ ఫ్రీ నంబర్ల ఉపయోగాలను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికార కేంద్రం సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Next Story