ఆర్టీసీ డ్రైవ‌ర్ తో మ‌హిళ‌ల వాగ్వాదం

by Bhanu |

ఉచిత బ‌స్సు ప్రయాణ‌ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌పై ఆర్టీసీ సిబ్బంది నిర్ల‌క్ష్యం రోజురోజుకు ఏదో ఒక చోట బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది.

ఆర్టీసీ డ్రైవ‌ర్ తో మ‌హిళ‌ల వాగ్వాదం
X

దిశ, వీపనగండ్ల : ఉచిత బ‌స్సు ప్రయాణ‌ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌పై ఆర్టీసీ సిబ్బంది నిర్ల‌క్ష్యం రోజురోజుకు ఏదో ఒక చోట బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. గురువారం కొల్లాపూర్ నుంచి వీపనగండ్ల మీదుగా వనపర్తికి వెళ్లే ఆర్టీసీ బస్సు మధ్యలోని కల్వరాల వద్ద ఆగకపోవడంతో మహిళా ప్రయాణికులు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన చోటుచేసుకుంది. వీపనగండ్ల గ్రామం వెలుపల బస్సు కోసం వేచిచూస్తున్న మహిళలు ఆపమని పలుమార్లు అరిచినా డ్రైవర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లి దూరంలోనే బస్సును ఆపాడు. వనపర్తికి వెళ్లేందుకు మరో బస్సు లేని పరిస్థితిలో బ‌స్సును ఎందుకు ఆపలేదని మహిళలు డ్రైవర్‌ను నిలదీశారు.

Next Story