- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కరువైంది
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని అమ్మాయిలకు రక్షణ లేదని, పోక్సో బాధితులకు న్యాయం జరగడం లేదని, అలాగే బండి సంజయ్ కుమారుడు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై అమ్మాయిల రక్షణ విషయంలో నోరు మెదపడం లేదని, వెంటనే వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

దిశ, జడ్చర్ల : సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని అమ్మాయిలకు రక్షణ లేదని, పోక్సో బాధితులకు న్యాయం జరగడం లేదని, అలాగే బండి సంజయ్ కుమారుడు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై అమ్మాయిల రక్షణ విషయంలో నోరు మెదపడం లేదని, వెంటనే వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జడ్చర్ల పట్టణంలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వైష్ణవి 24 కుటుంబాన్ని బుధవారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్చర్ల పట్టణంలోని వైష్ణవి ఇంటికి చేరుకొని వైష్ణవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే అమ్మాయిలకు పోక్సో బాధితులకు రక్షణ లేకుండా పోయిందని పోలీసులు ఉంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని తమ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ పెట్రోలింగ్ వ్యవస్థను సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరిగిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మాయిలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ బండి సంజయ్ కుమారుడికి వత్తాసు పలుకుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చదువుతున్నారని వారికి తెలంగాణలో తిరిగే నైతిక హక్కు లేదని వెంటనే కాంగ్రెస్ నేతలతో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్ తన కుమారుడు సాయి భగీరథ కేసు విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి సిగ్గుందా..? అని ప్రశ్నించారు. సాయి భగీరథ బాధితురాలు అయిన మైనర్ బాలిక ఇద్దరు బావమరదల్లా తిరుగుతున్నారని మైనర్ బాలిక కార్ డ్రైవ్ చేస్తూ తన ఇష్టపూర్వకంగానే కార్యక్రమాలు చేశారని అనడానికి సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు. మీకు ఆడపిల్లలు లేరా.? అంటూ ప్రశ్నించారు.
బీజేపీ నేతలు మొదటి నుంచి చెబుతున్న భేటీ బచావో బేటి పడావో కేవలం డ్రామాలు మాత్రమే అని స్పష్టమైందని అన్నారు. బండి సంజయ్ సోషల్ మీడియా సభ్యులు, అమ్మాయిల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అమ్మాయే మొత్తం తప్పు చేసింది. అబ్బాయి మంచోడు అనేలా క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాము పోరాడుతామని ఆయన అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రోజు 18 గంటలు రివ్యూ చేస్తున్నానని చెప్పుకుంటూ పెట్రోలింగ్ వ్యవస్థను తనవైపు తిప్పుకుంటూ వారి ఆస్తులను కాపాడుకోవడానికి భూముల దందాలను పెంచుకోవడానికి అన్నదమ్ములు అంతా కలిసి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మైనర్ బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలో లేకుండా రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య బీఆర్ఎస్ నాయకులు బాలాజీ రామ్మోహన్, నాగిరెడ్డి ఇంతియాజ్ శ్రీకాంత్, ఆచారి, టైగర్ నరసింహ, కరాటే శ్రీను, ఆలూరి శశికిరణ్, మహమూద్, ముఖిద్, సేర్వస్ శ్రీనివాసులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






