- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజంలో మహిళలకు న్యాయం జరగడంలేదు : న్యాయవాది స్వేచ్ఛ
ప్రస్తుతం మహిళలకు ఉన్న చట్టాలు న్యాయం చేసేవిగా ఉన్నా, వాటి ఆచరణలో, పోలీసుల విచారణలో అనేక లోపాలు ఉన్నందున మహిళలకు న్యాయం జరగడంలేదు హైకోర్టు న్యాయవాది బి.స్వేచ్ఛ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రస్తుతం మహిళలకు ఉన్న చట్టాలు న్యాయం చేసేవిగా ఉన్నా, వాటి ఆచరణలో, పోలీసుల విచారణలో అనేక లోపాలు ఉన్నందున మహిళలకు న్యాయం జరగడంలేదు హైకోర్టు న్యాయవాది బి.స్వేచ్ఛ అన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఓల సంఘ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన 'అంతర్జాతీయ మహిళా పోరాట దినం' సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. తమకు న్యాయం జరగటం లేదని కొందరు ధైర్యంగా కోర్టులకు వెళ్లినా కేసులు సంవత్సరాల కొద్ది వాయిదాల పడడం, ఆర్ధిక ఇబ్బందులు తోడు కావడం, కోర్టులో న్యాయం జరగపోవడం లాంటివి జరుగుతున్నాయని, ఎంతటి గృహ హింసలనైనా భరిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో చనిపోతున్నారు తప్ప, ధైర్యంగా బయటకు రాలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల్లో చైతన్యం రావాలని ధైర్యంగా బయటకు వచ్చి అన్యాయంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతాంజలి, సంధ్యారాణి, శాంతకుమారి, నారాయణమ్మ, సుహాసిని, మానేసి, సృజన, నర్మదా, స్పందన, విజయలక్ష్మి పాల్గొన్నారు.






