బస్సులు ఆపలేదని మహిళల ఆగ్రహం

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం జాతీయ రహదారి మన్ననూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గంట గంటల తరబడి శ్రీశైలం వెళ్ళేందుకు సూచించిన ప్రయాణికులు

బస్సులు ఆపలేదని మహిళల ఆగ్రహం
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం జాతీయ రహదారి మన్ననూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గంట గంటల తరబడి శ్రీశైలం వెళ్ళేందుకు సూచించిన ప్రయాణికులు బస్సులు ఎంతకీ ఆపకపోవడంతో అసహనంతో ప్రయాణికులు ఆదివారం సాయంత్రం ప్రయాణికులు అంబేద్కర్ చౌరస్తా వద్ద బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. బస్సు ల డ్రైవర్లను బస్సులు ఎందుకు ఆపడం లేదని ఇంతకాలం ఇక్కడ నిరీక్షణ చేయాలని ఆ గ్రహం వ్యక్తం చేశారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది. ఒకపక్క ప్రతి బస్సు లో స్టాండింగ్ కెపాసిటీ తో వెళుతున్నప్పటికీ చేసేది లేక బస్సులు ఆపకుండా వెళ్ళిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేయడంలో విఫలం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాకతో పరిస్థితి సద్దుమణిగింది.

Next Story