- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగు పడి మహిళ మృతి
దిశ, నారాయణపేట క్రైమ్ : ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురై నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ళ వీధికి చెందిన కందుకూరు పద్మ (45) మృతి చెందింది. నారాయణపేట పళ్ళ

X
దిశ, నారాయణపేట క్రైమ్ : ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురై నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ళ వీధికి చెందిన కందుకూరు పద్మ (45) మృతి చెందింది. నారాయణపేట పళ్ళ బుజుర్గ్ శివారులో ఆర్టీవో కార్యాలయం వెనకాల పద్మ కు సుమారు ఒక ఎకరా వ్యవసాయ పొలం ఉంది. భర్త కుటుంబ పోషణ కోసం వీధులు తిరుగుతూ గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తూ ఉంటాడు. పొలం పనుల్లో భాగంగా పత్తి పంట పనిలో పద్మ ఉండగా.. సాయంత్రం సమయంలో జిల్లా కేంద్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు పిడుగు పడటంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి పరామర్శించింది. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
Next Story






