- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూరగాయలు ఉద్దెర ఇయ్యలేదని కొంకలపల్లిలో మహిళ పై దాడి
మహిళల సాధికారికతకై వారికోసం రక్షణ, సమానత్వం, గౌరవం కల్పించడానికే మహిళలపై దాడులు అరికట్టడానికై ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి.

దిశ, రేవల్లి : మహిళల సాధికారికతకై వారికోసం రక్షణ, సమానత్వం, గౌరవం కల్పించడానికే మహిళలపై దాడులు అరికట్టడానికై ప్రభుత్వాలు వివిధ రకాలైన కఠినమైన చట్టాలు తీసుకొచ్చి అమలు చేయడానికి అండగా నిలుస్తున్నా క్రింది స్థాయి అధికారులు వాటిని అమలు చేయకుండా తన సొంత లాభానికి తొక్కి పెడుతుండడంతో అట్టి చట్టాలు అభాసు పాలవుతున్నాయి. అచ్చం ఇలాంటి సంఘటనే మండల పరిధిలోని కొంకలపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నాగపూర్ గ్రామానికి చెందిన కావాలి తిరుపతయ్య ఆటో నడుపుకుంటూ అతని భార్య నాగమణి వారంతా సంతలు గ్రామాలలో కూరగాయలు అమ్ముకొని పొట్ట పోసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. కొంకలపల్లి గ్రామంలో కూరగాయలు అమ్మడానికై వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ కూరగాయలు ఉచితంగా లేదా ఉద్దెర ఇయ్యాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భర్తకు తెలిపి ప్రశ్నించడానికి వెళ్లిన ఇరువురిపై ఈనెల 13న దాడికి పాల్పడ్డాడు. తన భార్యపై దాడి చేస్తుండగా.. అడ్డువెళ్లిన భర్తకు ఘర్షణలో ఎడమ కన్నుకు, చెవికర్ణభేరికి గాయమవ్వగా స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా విచారణ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. గాయాలకు చికిత్స కోసం రిఫర్ చేశారని చర్యలు మాత్రం రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని బాధితురాలు కావలి నాగమణి తెలిపారు. సాటి మహిళపై దాడిచేసి అడ్డొచ్చిన కుటుంభసభ్యులపై దాడి చేసినట్లు పిర్యాదు చేసి ఐదు రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం ఏంటోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎస్సై రజిత ఫోన్ లో సంప్రదించగా స్పందన కరువైంది.






