నిలిచిపోతున్న భూభారతి రిజిస్ట్రేషన్లు

by Ratna Kumari |

దిశ‌, రేవల్లి : మండల కేంద్రంలోని త‌హ‌శీల్దార్ కార్యాలయంలో అనునిత్యం ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు జరగాల్సిన ఆయా గ్రామాలకు చెందిన భూభారతి

నిలిచిపోతున్న భూభారతి రిజిస్ట్రేషన్లు
X

దిశ‌, రేవల్లి : మండల కేంద్రంలోని త‌హ‌శీల్దార్ కార్యాలయంలో అనునిత్యం ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు జరగాల్సిన ఆయా గ్రామాలకు చెందిన భూభారతి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు త‌హ‌శీల్దార్ అకారణ గైరహదారితో నిలిచిపోతున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలిపిన స్పందన కరువవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులను గురవుతున్నారు. మండలంలో ఆయా గ్రామాల్లోని వ్యవసాయభూములు మార్పులు చేర్పులు మరియు అమ్మకాలు కొనుగోళ్లు చేసుకునే వారికి అనుకూల సమయాన్ని బట్టి ప్రభుత్వానికి వేల రూపాయల రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ తేదీలను ఖరారు చేసుకుంటున్నారు. అమ్మకాలు, కొనుగోలు మార్పులు చేర్పులు చేసుకునే వారు అందుకు సంబంధించిన సాక్షులను తీసుకెళ్లి త‌హ‌శీల్దార్ కార్యాలయం చేరుకోగా ఇక్కడి త‌హ‌శీల్దార్ లక్ష్మీదేవి అకారణంగా ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అవుతోంది. ఈమె స్థానంలో ఉన్నతాధికారులు రిజిస్ట్రేషన్ నిలిపియకుండా కొనసాగించడానికి ఇంచార్జ్ త‌హ‌శీల్దార్ల‌ను నియమించకపోవడంతో భూభారతి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి వారంతా విలువైన సమయాన్ని కోల్పోయి వెను తిరుగుతున్నారు. హైదరాబాద్ లో పనులు చేసుకునే రేవల్లి కు చెందిన ఓ వ్యక్తి తన అవసరాల నిమిత్తం వ్యవసాయ భూముల్లో మార్పులు చేసుకొడానికై ప్రభుత్వానికి రూపాయలు 17312/- చెల్లించి 2500719864 నం డాక్యుమెంట్ ద్వార బుధవారం తేదీలను ఖరారు చేసుకుని త‌హ‌శీల్దార్ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మార్వో లక్ష్మీదేవి గైర్హాజరు అయింది. దీంతో వారు విలువైన సమయాన్ని కోల్పోయి వారంతా వెనుతిరిగారు. ఇదే గ్రామానికి చెందిన మరో మహిళా రైతు బ్యాంకు రుణంకోసం 2500606566 నంబర్ గల డాక్యుమెంట్ ద్వారా ఆగస్టు 25న తేదీలను ఖరారు చేసుకుని కన్సల్ట్ పర్సన్స్ అయినా ఉన్నత చదువులకై హైదరాబాద్ లో ఉంటున్న కుటుంబ సభ్యులను పిలుచుకొని బ్యాంక్ అధికారులతో కలిసి మాటిగేజ్ రిజిస్ట్రేషన్ కోసం త‌హ‌శీల్దార్ కార్యాలయానికి చేరుకోగా.. అక్కడ ఉండాల్సిన తహసిల్దార్ విధులకు గైర్ హాజరుఅవగా ఈవిషయాన్ని ఆమెను ఫోన్లో సంప్రధించి ప్రశ్నించగా అది మనసులో పెట్టుకొని వేధింపులకు గురిచేసి ఐదు రోజులు తర్వాత ఆగస్టు 30న మార్థిగేజ్ రిజిస్ట్రేషన్ చేసింది. ప్రశ్నించేవారు లేక పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రేవల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలను అని నిత్యం జరుగుతూనే ఉన్నాయని మండల ప్రజలు బహటంకంగా విమర్శిస్తున్నారు.

Next Story