- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'భరోసా కేంద్రం'తో మహిళలకు భరోసా కల్పించాం : ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : 'భరోసా' కేంద్రం స్థాపించి మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడమే కాకుండా, వారికి సహాయం, పునరావాసం కల్పించి భరోసా కల్పించామని ఎస్పీ జానకి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : 'భరోసా' కేంద్రం స్థాపించి మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడమే కాకుండా, వారికి సహాయం, పునరావాసం కల్పించి భరోసా కల్పించామని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా కేంద్రంలో 'భరోసా సెంటర్' స్థాపించి బుధవారంతో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా భరోసా కేంద్రంలో నిర్వహించిన వార్షికోత్సవం కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర తో కలిసి జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంగా సీడబ్ల్యూసీ సహకారంతో భరోసా సెంటర్ కు అందిన 163 కేసులను ఎస్పీ వివరించారు. 117 ఫోక్స్ కేసులు, 24 రేప్ కేసులు, ఇతర 22 కేసులను నమోదు చేశామని, అలాగే 218 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని,119 మందికి జరిమానాలు విధించినట్లు ఆమె తెలిపారు. డీడబ్ల్యూఓ వారి సహకారంతో ఇప్పటి వరకు 45 మంది బాధితులకు ₹ 11,25000 లు పరిహారం అందజేశామని ఎస్పీ తెలిపారు. జడ్జి ఇందిర మాట్లాడుతూ, భరోసా కేంద్రం మహిళల భద్రతకు, పిల్లల రక్షణకు ఒక విశ్వసనీయ వేదికగా ఎదిగిందని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సిడబ్ల్యూసి నయిమోద్దీన్ జెజెబి గ్రేసి, డిసిపిఓ నర్మద, భరోసా ఎస్ఐ అరుణ పాల్గొన్నారు.






