- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మళ్లీ సారా మొదలవుతుందా..?
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు రానున్నాయా..? అవుననే చెప్పవచ్చు. రాష్ట్రంలో మళ్లీ నాటు సారా గుప్పు మననుందా..? అంటే అవుననే సంకేతాలే ఇచ్చారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు.

దిశ, జడ్చర్ల : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు రానున్నాయా..? అవుననే చెప్పవచ్చు. రాష్ట్రంలో మళ్లీ నాటు సారా గుప్పు మననుందా..? అంటే అవుననే సంకేతాలే ఇచ్చారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ నూతన భవన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి కార్యాలయం ప్రారంభించారు. అనంతరం పురపాలక సంఘం నూతన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రపంచంలో అనేక దేశాల్లో అమలవుతున్న లిక్కర్లతో పోలిస్తే నాణ్యమైన మన రాష్ట్రంలోని ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. ఇది అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు గిరిజనులకు ఉపాధి కల్పించిన వారవుతామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని.. రాష్ట్రంలో గిరిజనుల ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే ఇప్ప పువ్వు సారా కి అనుమతి ఇవ్వాలని ఆయన చేసిన రీసెర్చ్ నివేదికను తనకు అందించారని తెలిపారు.
దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా లోతుగా అధ్యయనం చేస్తానని తాను అధ్యయనం చేసిన అనంతరం అసెంబ్లీలో కూడా ఈ అంశంపై చర్చించి ఇది సాధ్యమా..? అసాధ్యమా..? అనే అంశాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ఏది చేసినా ప్రజలకు మంచి జరిగే విధంగానే నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సారా పై అనేక ఉద్యమాల ద్వారా ప్రజా ఆరోగ్యం పై దృష్టి సారా నిషేధం విధించడం జరిగిందని కానీ తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే సారా పై మాట్లాడటం ఆ అంశాన్ని ఆ శాఖ మంత్రి కొట్టి పడేయకపోవడం రాష్ట్రంలో మళ్లీ సారా పాలసీని ప్రారంభించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు మంత్రి వ్యాఖ్యలు దోహదపడుతున్నాయి దీంతో రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు రానున్నాయని మళ్లీ తారా దుకాణాలు తెరవనున్నారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






