- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన తలుపులు తెరిచే ఉంటాయి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన తలుపులు తెరిచే ఉంటాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అ

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన తలుపులు తెరిచే ఉంటాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ విభాగాల్లో దశాబ్ధాల పాటు నిబద్ధతతో పనిచేసి, రిటైర్మెంట్ తర్వాత ప్రజాసేవనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న విశ్రాంత ఉద్యోగులు సమాజానికి సజీవ గ్రంథాలని ఆయన ప్రశంసించారు. రిటైర్డ్ ఉద్యోగుల అనుభవం, క్రమశిక్షణ, విలువలు నేటి యువతకు ఆదర్శమని వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పెన్షన్లు, వైద్యం, సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, అసోసియేషన్ అధ్యక్షుడు సాయిల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంజయ్యాచారి, ప్రభాకర్, బాలకిషన్, జగపతి రావు, టిన్జీఓల సంఘ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, చంద్రా నాయక్ పాల్గొన్నారు.






