- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోనూ ప్రకారం భోజనం అందుతుందా? :కలెక్టర్ విజయేందిర బోయి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మీ స్కూల్ కు టీచర్లు రోజూ వస్తున్నారా? పాఠాలు బాగా చెపుతున్నారా? మీరు బాగా చదువుకుంటున్నారా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి విద్యార్థిని లను

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మీ స్కూల్ కు టీచర్లు రోజూ వస్తున్నారా? పాఠాలు బాగా చెపుతున్నారా? మీరు బాగా చదువుకుంటున్నారా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి విద్యార్థిని లను అడిగారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని భూత్పూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠ్యాంశాల బోధన, ప్రత్యేక తరగతులు, మోనూ, మౌలిక వసతులు, పరిసరాల శుభ్రత ను తనిఖీ చేశారు. వంట గదిలోకి వెళ్ళి అన్నం, కూరగాయలను రుచి చూశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, పాఠశాలకు రెగ్యులర్ గా హాజరవుతూ సబ్జెక్టు విషయాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని సూచించారు. పాఠశాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పారిశుద్ధ్యం, విద్యార్థినిల ఆరోగ్యం పట్ల, నాణ్యమైన భోజనం అందించాలని తదితర అంశాల పట్ల ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ కిషన్, తదితరులు ఉన్నారు.






