కొల్లాపూర్ ప్ర‌జ‌ల తీర్పు ఎటువైపు..?

by Ratna Kumari |

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.

కొల్లాపూర్ ప్ర‌జ‌ల తీర్పు ఎటువైపు..?
X

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. కొల్లాపూర్ ప‌ట్ట‌ణ కేంద్రంలో 80.1 శాతం ఓటింగ్ జ‌రిగింది. దీంతో ఉత్కంఠ క‌లిగిస్తోంది. ఓట‌ర్లు ఎవ్వ‌రికీ ప‌ట్టం క‌ట్టార‌నేది అంతు చిక్క‌డం లేదు. విజ‌యావ‌కాశాల‌పై అభ్య‌ర్థులు తామే గెలుస్తామంటే తామే గెలుస్తామ‌నే ధీమాలో ఉన్నారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ నీ పట్టణ శివారులోనీ పీజీ సెంటర్ లో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోనీ 19 వార్డులకు మొత్తం 19,356 ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 7,809, పురుషులు 7,696 ఓట్లు పాల‌య్యాయి. 80.1 శాతం నమోదయింది.19 వార్డులకు ప్రధాన రాజకీయ పార్టీల గుర్తుల పై 58 మంది అభ్యర్థులు, ఇద్దరు ఇండిపెండెంట్ తో కలసి మొత్తం 60 మంది మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఓటింగ్ లో ఓటరు నాడీ ఎవ్వరికి అంతుపట్టని విధంగా ఉంది. 2020లో తొలి సారిగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ అధ్యక్షా పీఠం దక్కించుకుంది. ఇప్పుడు రెండోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ నేత మంత్రి జూపల్లి, బీఆర్ ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి, బీజేపీ నేత ఎల్లెన్ని సుధాకర్ రావు ఎవ్వరికి వారు అంతర్గతంగా వార్డులలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్ల కు డబ్బులు, చీరలు, రింగ్ లు ప్రలోభాలకు గురి చేశారు.

అయితే ఎన్నికలు ప్రకటించక ముందు నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. రకరకాల ఒత్తిడిల కారణంగా నలిగిపోయిన కుల సంఘాలు ఓటర్లు అందరికి సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. ఓటు వేసే విషయంలో మాత్రం తమ అంతరంగాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఆ ఓటు తమ దంటే తమదంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సంబరపడుతూ వస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రధాన పార్టీల అభ్యర్థులు నాయకులు వేర్వేరుగా గ్రూపులుగా ఏర్పడి ఓటింగ్ సరళి పై జరుపుకుంటున్న చర్చలు సమీక్షలు ఆసక్తికరంగా ఆశ్చర్యంగా ఉన్నాయి. పలానా వార్డులో తమకే మెజార్టీ అని ఒక పార్టీ నాయకులు, ఇంత పర్సంటేజీ ఓట్లు తమకని మరోకరు, ఆ వార్డులో 60 శాతం ఓట్లు మొత్తం మాకేనని ఒకరు,వారికి చెప్పి మాకు ఓటేస్తామని స్పష్టమైన హామీ ఉందన్న ధీమాలో మరొకరు ఇలా ఎవరి అంచనాలు వారికి ఉండగా ఓటర్లు మాత్రం రాజకీయ పరిశీలకులకు సైతం అంతుపట్టకుండా ప్రశాంతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ పార్టీ గెలుస్తుందన్న విషయం ఓట్ల లెక్కింపు తరువాత బయటపడటం సహజమే. అయినా ఎంతో కొంత ట్రెండ్ పోలింగ్ రోజు బయటపడటం కూడా మామూలు విషయమే. ఇలాంటి పరిస్థితి కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. ఎవ్వరికి వారు తామే గెలుస్తామన్న ధీమాలో అభ్యర్థులు ఉన్నారు.

బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన త‌రువాత బ్యాలెట్ బాక్సులను ఓట్ల లెక్కింపు కోసం పట్టణంలోని పీజీ కాలేజీకి అధికారులు తరలించి భద్ర పరిచిన విషయం విదితమే. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరుగనున్నడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. దీంతో ఓట్ల లెక్కింపులో ప్రజా తీర్పు ఎలా వస్తుందోనన్న భయం తో అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్ మొదలైంది.

Next Story