- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా పాలనలో మహిళలకు రక్షణ ఏది..?
దిశ, మూసాపేట : ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

దిశ, మూసాపేట : ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హత్యలు జరుగుతుంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఇటీవల అత్యాచారానికి గురై మృతి చెందిన యువతీ కుటుంబాన్ని ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అభిలాష రావు, మాజీ జడ్పీ చైర్మన్ కొడుగల్ యాదయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరు, తదితర వివరాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలనలో దళితులు, గిరిజన మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. రెండేళ్లలో అత్యాచారాలు.. హత్యలు నిత్య కృత్యం అయిపోయాయి అని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ దళిత యువతిపై అత్యాచారం జరిగి.. ప్రాణాలు కోల్పోయిన, దళిత బాలికపై దొంగతనం నిపం మోపితే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న, ఓ చెంచు మహిళను చితక బాబీన, షాద్ నగర్ నియోజకవర్గంలో దళిత మహిళను విచక్షణ రహితంగా కొట్టిన ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదు అని శ్రీనివాస్ ఆరోపించారు.
నిత్య కృత్యంగా మారిన ఈ సంఘటనలో ఈ పాలకులు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. వేముల సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్న బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పరిస్థితులు ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి అన్నారు. ఇన్ని దారుణాలు రాష్ట్రంలో జరుగుతుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇటువంటి కేసులపై డీజీపీ వెంటనే స్పందించి ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. వేముల గ్రామంలో జరిగిన దారుణ ఘటన బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వేముల గ్రామ యువతి మృతికి సంబంధించి పోలీసులు లోతుగా విచారణ జరిపి ఈ దారుణంలో ఒక్కడే ఉన్నాడా..? లేక మరింతమంది ఉన్నారా అన్న అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.






