బాల్యానికి భద్రత ఏది..?

by Ratna Kumari |

ఈ మ‌ధ్య కాలంలో నారాయ‌ణ‌పేట జిల్లాలో సంచ‌ల‌న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. పసిపిల్లల నుంచి ప‌దో తరగతి విద్యార్థుల వరకు పాఠశాలకు పంపాలంటేనే మనిషిని నమ్మలేని పరిస్థితి దాపురించింది.

బాల్యానికి భద్రత ఏది..?
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : బాలికలపై వరుస ఘటనలతో సంచలన వార్తలకు కేరాఫ్ గా తయారవుతుంది నారాయణపేట జిల్లా. మొన్న మోమినాపూర్ పాఠశాలలో విద్యార్థిని పై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల ఘటన మరువకముందే మ‌ళ్లీ నారాయణపేట మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఐదు సంవత్సరాల అభం శుభం తెలియని తేజశ్రీని హత్య చేసి గ్రామ చెరువు కట్ట పై పాప మృతదేహం పడేసిన సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. ఐదు సంవత్సరాల పసి పాపను అత్యాచారం చేసి ఆపై చెవిలో, కాళ్ళ కు ఉన్న‌ బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను అపహ‌రించుకొని పోయిన కామాంధులపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగుతుంది. పసిపిల్లల నుంచి ప‌దో తరగతి విద్యార్థుల వరకు పాఠశాలకు పంపాలంటేనే మనిషిని నమ్మలేని పరిస్థితి దాపురించింది. చివరికి మోనాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు చేసిన ఘనకార్యానికి అతనికి సహకరించిన ఆరుగురు జైల్లో ఊచల లెక్కబెడుతున్నారు. జరిగిన వరుస ఘటనలతో వణికి పోతున్నారు తల్లిదండ్రులు.

మృగాల్లా మారిన మనుషులు మానవత్వం లేకుండా జల్సాలకు, ఈజీ మనీ కోసం కొంతమంది యువకులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తుకు బానిసలుగా మారుతున్న మనిషి మానవ విలువలు మంటగలిసేలా మతిభ్రమించి కామ వాంఛల కోసం పసి పిల్లల హృదయాలను పావులుగా వాడుకుంటున్నారు. అవసరాల కోసం హత్యలు చేయడం మామూలుగా మారింది. బాల, బాలికల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా కామందులకు మానవ మృగాలకు చుట్టాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న నారాయ‌ణ పేట జిల్లా ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాన్ని మాత్ర‌మే న‌మ్ముకుంటారు. తాను ప‌డ్డ క‌ష్టాలు త‌మ పిల్ల‌లు ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో పిల్ల‌ల ఉన్న‌త విద్య, అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతూ పిల్ల‌ల చ‌దువులే పెట్టుబ‌డిగా బ్ర‌తుకుతున్న ప్ర‌జ‌లు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు తావు లేకుండా ప్ర‌శాంతంగా శాంతియుతంగా ఉండే ప్రాంత‌వాసులు ప‌సిపిల్ల‌ల‌ను బ‌య‌టికి పంపాలంటేనే భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా ఆట, పాటలతో గడపాల్సిన బాల్యానికి భద్రత లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటికైనా బాల్యం పై భద్రత కల్పించాల్సిన అవసరం పోలీసుల‌పై ఉంద‌ని.. ఇలాంటి కామాందుల కోసం కఠినమైన చట్టాలను తీసుకురావాల‌ని ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పోలీసుల పెట్రోలింగ్ పెంచాల్సిన‌ అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎన్ని చట్టాలు ఉన్నా మహిళలకు భద్రత లేదు : పీఓడ‌బ్ల్యూ జిల్లా ఉపాధ్య‌క్షులు ల‌క్ష్మీ

ప్రభుత్వాలు మహిళల పట్ల ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, మానభంగాలు ఆగడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవ‌డం సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. నారాయణపేట మండలంలో బసి రెడ్డి పల్లి లో జరిగిన ఐదేళ్ల తేజశ్రీ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కామాంధుల కోసం కఠినమైన చట్టాలను తీసుకురావాలి. ఇలాంటి ఘటనలన్నీ మద్యం మత్తులో జరుగుతున్నవి. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేసి గ్రామాలలో బెల్ట్ షాపులను ఊడ్చి వేయాల‌న్నారు.

Next Story