పురుగుల అన్నం తింటే ఏమ‌వుతుంది.. హెడ్మాస్ట‌ర్ సెన్షేష‌న్ కామెంట్స్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నంలో పురుగులు వ‌స్తున్నాయ‌ని విద్యార్థులు పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇవాళ

పురుగుల అన్నం తింటే ఏమ‌వుతుంది.. హెడ్మాస్ట‌ర్ సెన్షేష‌న్ కామెంట్స్
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నంలో పురుగులు వ‌స్తున్నాయ‌ని విద్యార్థులు పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇవాళ కూడా అలాంటి ప‌రిస్తితే చోటు చేసుకుంది. అయితే పురుగుల‌తో ఉన్న అన్నం తింటే ఏమ‌వుతుంది..? మీ ఇంట్లో వ‌స్తే ఇలాగే చేస్తారా..? ఎందుకు ర‌చ్చ చేస్తున్నార‌ని హెడ్ మాస్ట‌ర్ పేర్క‌న‌డం గ‌మ‌నార్హం. దీంతో విద్యార్థులు, హెడ్ మాస్ట‌ర్ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబీవీపీ సంఘం మ‌ద్ద‌తులో పాఠ‌శాల ముందు విద్యార్థులు ధ‌ర్నా చేప‌ట్టారు. గ‌త మూడు, నాలుగు రోజుల నుంచి అన్నం, చారులో తెల్ల పురుగులు వ‌స్తున్నాయ‌ని.. ప‌లుమార్లు ప్ర‌ధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెల్లినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అన్నం తిన‌లేక చెత్త‌కుండీలో ప‌డేస్తున్నామ‌ని చెప్పారు. స్థానిక మండ‌ల విద్యాధికారి అనిల్ గౌడ్ వ‌చ్చి వివ‌రించిన అధికారుల‌ను, హెడ్ మాస్ట‌ర్ ని నిల‌దీసినా కానీ అదే సీన్ రిపీట్ కావ‌డం గ‌మ‌నార్హం.


పాఠ‌శాల హెడ్ మాస్ట‌ర్ పురుగులు అన్నం తింటే ఏమ‌వుతుంది..? అని మాట్లాడ‌టం చాలా బాధ వేసింద‌ని విద్యార్థులు వాపోయారు. ముఖ్యంగా వంట‌వాళ్ల‌కు ప్ర‌ధానోపాధ్యాయుడు వ‌త్తాసు ప‌ల‌క‌డం వెనుక ఆంత‌ర్యం ఏంట‌ని..? ఏబీవీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నాన్ని అందించాల‌ని ఏబీవీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. మ‌రోవైపు విద్యార్థులు, ఏబీవీపీ నాయ‌కులు ధ‌ర్నా చేప‌డుతున్నారనే విష‌యం తెలుసుకున్న త‌హ‌శీల్దార్ స‌తీష్ కుమార్, జిల్లా సివిల్ స‌ప్లై అధికారి, విద్యాధికారి గోవింద‌రాజులు విద్యార్థినిల‌ను శాంతింప‌జేసి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామి ఇచ్చారు. మెను ప్ర‌కారం.. విద్యార్థుల‌కు భోజ‌నం వ‌డ్డించాల‌ని.. హెడ్ మాస్ట‌ర్, ఏజెన్సీలు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. పాఠ‌శాల‌కు ఇచ్చిన బియ్యాన్ని గోదామ్ కి పంపించి కొత్త బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేయాల‌ని సివిల్ స‌ఫ్లై అధికారుల‌కు జిల్లా విధ్యాధికారి గోవింద‌రాజులు చెప్పారు.

Next Story