అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : వనపర్తి ఎమ్మెల్యే

by Chintha Aamani |

పైరవీలకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా కల్పించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : వనపర్తి ఎమ్మెల్యే
X

దిశ,వనపర్తి: పైరవీలకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా కల్పించారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యే మేఘా రెడ్డి పార్టీ నాయకులతో కలిసి 1,2 వ వార్డులలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. వార్డు వాసులతో మాట్లాడారు. వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ 18 నెలల ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ,అభివృద్ధి పథకాలను వివరించారు. కాలనీ వాసుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో తలెత్తుతున్న సమస్యలను కలెక్టర్ తో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

వార్డులలో నెలకొన్న పారిశుధ్య,విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.వనపర్తి నియోజకవర్గం లో పైరవీలకు ఆస్కారం ఇవ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు.ప్రజలు ఇందిరమ్మ రాజ్యపాలన పై సంతృప్తి వ్యక్తం చేశారాని తెలిపారు.రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,మాజీ వార్డు కౌన్సిలర్ రమాదేవి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహీం,మాజీ మున్సిపల్ చైర్మన్ మహేష్,పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్,ఓబీసీ జిల్లా అధ్యక్షులు రవి,తదితరులు పాల్గొన్నారు.

Next Story