రాజకీయాల‌కు అతీతంగా అభివృద్ధికి క‌లిసి ప‌ని చేస్తాం : CM రేవంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

గత ఎంపీ ఎన్నికలలో డీకే అరుణమ్మను ఓడించేందుకు నాతోపాటు.. వేదిక మీద ఉన్న అందరము శాయశక్తుల ప్రయత్నించామ‌ని.. అయినప్పటికీ ప్రజలు అరుణమ్మని గెలిపించారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు.

రాజకీయాల‌కు అతీతంగా అభివృద్ధికి క‌లిసి ప‌ని చేస్తాం : CM రేవంత్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో / మహబూబ్ నగర్ ప్రతినిధి : గత ఎంపీ ఎన్నికలలో డీకే అరుణమ్మను ఓడించేందుకు నాతోపాటు.. వేదిక మీద ఉన్న అందరము శాయశక్తుల ప్రయత్నించామ‌ని.. అయినప్పటికీ ప్రజలు అరుణమ్మని గెలిపించారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎంపీ డీకే అరుణ ప్రసంగించే సమయంలో నన్ను ఓడించేందుకు ఇక్కడ వేదికపై ఉన్నవారు అందరూ ప్రయత్నించినోళ్లే.. అయినప్పటికిని జిల్లా అభివృద్ధి కోసం , మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తూ.. కేంద్రం నుండి రావలసిన నిధులు, పనులను సాధించుకోవడానికి కృషి చేస్తాము అని చెప్పారు. ఇదే విషయాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధి విషయములో కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించారు. దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ప్రసంగించే సమయంలోనూ రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి.. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలన్ని పరిష్కరించేందుకు కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా పనిచేద్దాం అని విజ్ఞప్తి చేస్తూ. నా ఎన్నికల కోసం నేను నాలుగైదు సభలకు మించి ఎప్పుడు హాజరు కాలేదు. కానీ వంశీ చంద్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలి అని 14 ఎన్నికల సభలలో పాల్గొని ప్రసంగించాను. మా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అరుణమ్మకు వ్యతిరేకంగా పనిచేసింది నిజం. అయినప్పటికీ ప్రజలు ఆమెను గెలిపించారు. అంతమాత్రాన విభేదాలను కొనసాగిస్తే అభివృద్ధి జరగదు. జిల్లా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తాము అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంపీడీకే అరుణమ్మ సహకారంతో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తాం సమస్యలు పరిష్కరించుకుంటాము .. ఎన్నికలు వస్తే మళ్లీ ఎవరి బాట వారిదే అని ముఖ్యమంత్రి చెప్పడం సభలో ఆసక్తికర చర్చనీయాంశం అయింది.

Next Story