- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోమశిలలో బడుగుల భూములను అక్రమంగా లాక్కోవడం సహించం : మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి
బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజున దళితుల భూములను హెలిప్యాడ్ కోసమంటూ అక్రమంగా లాక్కోవడం సహించమని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి హెచ్చరించారు.

దిశ, కొల్లాపూర్ : బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజున దళితుల భూములను హెలిప్యాడ్ కోసమంటూ అక్రమంగా లాక్కోవడం సహించమని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి హెచ్చరించారు. ఎలాంటి నోటీసులు లేకుండా దళితుల భూములు అన్యాయంగా లాక్కోవడం తీరు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడారు. భూములు కోల్పోతున్న దళిత సోదరులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న తమను అడ్డుకొని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అనే నాయకులు రైతులను అక్రమంగా నిర్బంధించడం చాలా దుర్మార్గమనీ మాజీ ఎమ్మెల్యే బీరం విమర్శించారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయనీ ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి వ్యతిరేకం కాము. కానీ చట్ట ప్రకారం చేయండి. చట్టాన్ని అధిగమించి అడ్డదిడ్డంగా చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. 1960 నుంచి నేటి వరకు పొజిషన్లో దళితులే ఉన్నారు. కానీ ఎలాంటి నోటీసులు లేకుండా అక్రమంగా అధికారులను అడ్డుపెట్టుకొని పొలాలను మంత్రి అండతో అధికారులు గుంజుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమశిల లో హెలిప్యాడ్ నిర్మాణం కొరకు పేదల దళితుల భూములు గుంజుకుంటూ వారికి అన్యాయం చేస్తున్న మంత్రి తన పద్ధతులు మార్చుకోవాలని, ప్రభుత్వ స్థలాలలో హెలిప్యాడ్ నిర్మించుకోవాలని ఆయన సూచించారు. హెలి టూరిజం అభివృద్ధి చేసుకోవాలీ .అంతే తప్ప తమ స్వార్థం కొరకు పేదల పొట్ట కొడుతూ బలవంతం గా భూములు గుంజుకుంటామంటే తాము చూస్తూ ఊరుకోమని, పేదల పక్షాన బి ఆర్ఎస్ పార్టీ అండగా ఉండి బాధితులకు న్యాయం జరిగే వరకూ న్యాయస్థానాలలో పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి పేర్కొన్నారు. స్వార్థంతో వ్యవహరిస్తూ కొల్లాపూర్ నియోజకవర్గంలోను, నాగర్ కర్నూల్ జిల్లాలో దుష్ట నియంత పాలన కొనసాగిస్తున్న వ్యక్తులకు వ్యతిరేకం గా పోరాటం చేయాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.






