భూత్పూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా రూపు దిద్దుతాం

by Ratna Kumari |

భూత్పూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా రూపుదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామ‌ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.

భూత్పూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా రూపు దిద్దుతాం
X

దిశ, భూత్పూర్ : భూత్పూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా రూపుదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామ‌ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీలోని మొత్తం పది వార్డులకు ఏడు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో పూర్తి మెజారిటీతో చైర్మన్ గా బాలకోటి, వైస్ చైర్మన్ గా లిక్కి సూర్య కళ, వార్డు స‌భ్యులు బాధ్యతలు సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ కేంద్రానికి చేరుకొని నూతనంగా ఎంపికైన చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మున్సిపల్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూత్పూర్ మున్సిపల్ ప్రజలు తమపై నమ్మకం ఉంచి మునిసిపాలిటీ బాధ్యతలు అప్పగించారు. మీ ఆశలను, ఆశయాలను మమ్ము చేయకుండా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామ‌ని ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్ కు మున్ముందు ఉన్నత పదవిని కట్ట పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలకోటి, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి , వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Next Story