- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ బెడ్ రూం ఇళ్లలో అవినీతి బయటపెడతాం : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో జరిగిన అవినీతిని బయటపెడతామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు.

దిశ, మిడ్జిల్ : గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో జరిగిన అవినీతిని బయటపెడతామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, త్రిబుల్ ఐటీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గారు జూన్ 23న మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ రోజు మిడ్జిల్ మండలం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని అన్నారు. ఉమ్మడి మిడ్జిల్, ఉర్కొండ మండలాల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులను సీఎం మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. మిడ్జిల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో సుమారు 42 లక్షల రూపాయల అవినీతి జరిగిందని, ఉర్కొండలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. ఈ అంశంపై త్వరలోనే పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి , తహసిల్దార్ స్వప్న, సర్పంచులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, నాగరాజు గౌడ్ , శ్రీశైలం యాదవ్, రాములు, గౌస్, మల్లికార్జున్ రెడ్డి, నరేందర్ రెడ్డి, విజయ్, శివ ప్రసాద్, రమేష్, నరసింహ, రాజు నాయక్ పాల్గొన్నారు.






