క్రీడ‌ల్లో రాణించాలి : డీవైఎస్ఓ వెంక‌టేష్ శెట్టి

by Ratna Kumari |

విద్యార్థులు క్రీడల్లో రాణించి ముందుకు పోవాలని నారాయణపేట జిల్లా డివైస్ఓ వెంకటేష్ శెట్టి అన్నారు. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పోటీలను ప్రారంభించారు.

క్రీడ‌ల్లో రాణించాలి : డీవైఎస్ఓ వెంక‌టేష్ శెట్టి
X

దిశ‌, ధ‌న్వాడ : విద్యార్థులు క్రీడల్లో రాణించి ముందుకు పోవాలని నారాయణపేట జిల్లా డివైఎస్స్ఓ వెంకటేష్ శెట్టి అన్నారు. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు ఎంపికలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీవైఎస్ఓ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొని రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను డీవైఎస్ఓ వెంకటేష్ శెట్టితో పాటు మండల విద్యాధికారి గాయత్రి లు పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story