క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాం

by Ratna Kumari |

కల్వకుర్తి పురపాలక ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు విజయం సాధించడం గర్వంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ అన్నారు.

క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాం
X

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి పురపాలక ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు విజయం సాధించడం గర్వంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ అన్నారు. సోమవారం పురపాలక సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం బీజేపీ కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ల ను శాలువాలతో సత్కరించి పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు గుర్రాల జ్యోతి రాంభూపాల్ రెడ్డి, బోడ నరసింహ, వరికుప్పల శ్రీరాములు, ఎనుగొండ రామకృష్ణ, కేతావత్ రేణుకలు మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన కల్వకుర్తి పట్టణ ప్రజలకు రుణపడి ఉంటామని వార్డు అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, బీజేపీ ఉన్నతికి కృషి చేస్తామన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం బీజేపీ శ్రేణులతో భారీగా ర్యాలీగా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయానికి ప్రమాణ స్వీకారోత్సవానికి త‌ర‌లివెళ్లారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు యెన్నం శేఖర్ రెడ్డి, బండల రామచంద్రారెడ్డి, సూర్య కృష్ణ గౌడ్, మోహన్ రెడ్డి, నరెడ్ల శేఖర్ రెడ్డి, గుండోజు గంగాధర్, పాలకూర రవిగౌడ్, సురేందర్ గౌడ్, జూలూరు బాలస్వామి, ధన్నోజు నరేష్ చారి, నాప శివ కార్యర్తలు పాల్గొన్నారు.

Next Story