శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

by Dishanational2 |
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు
X

దిశ, అచ్చంపేట : శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి గత 15 రోజులుకు పైగా వ‌ర‌ద ఉధృతి ఏమాత్రం తగ్గకుండా నిరంతరాయంగా వస్తూనే ఉన్నది. ఆదివారం సాయంత్రం వరకు ఎగువ నుండి కాస్త తగ్గినా తిరిగి సోమవారం ఉదయం నుండి వరద యధావిధిగా ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. శ్రీశైలం జ‌లాశ‌యం నిండు కుండ‌లా ఉంది. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు మొత్తం10 క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి యధావిధిగా నాగర్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుండి 3.94 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగివకు వస్తుండగా శ్రీశైలం ప్రాజెక్ కు 4, 16, 384 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,252 వేల క్యూసెక్కుల నీటితో శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ వద్ద విద్యుత్ ఉత్పత్తిని చేస్తు నాగార్జునసాగర్ దిగువకు నీటిని వదులుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఇన్ ఫ్లో 4.16 లక్షలు

శ్రీశైలం ప్రాజెక్టు కు 4.16 లక్షల ఇన్ ఫ్లో వస్తుండగా, ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులకు చేరుకోగా, ప్రాజెక్టు కెసాసిటీ 215. 807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212. 4385 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం భారీగా వరదరావడంతో 10 క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి 3, 76, 670 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు వదులుతున్నారు.

Next Story

Most Viewed