- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వనపర్తి మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకరణ పూర్తి
వనపర్తి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.

దిశ,వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ ల ప్రమాణస్వీకారం పూర్తయింది. వనపర్తి జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తహసీల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సమక్షంలో నూతనంగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు రెండు రోజులుగా క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 10:45 వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డిలతో కలిసి నేరుగా మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవులను బహుమతి ఇచ్చారు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవులను బహుమతిగా ఇచ్చారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ నూతన మున్సిపాలిటీ పాలక మండలి ఏర్పాటుఅయింది. నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవులను బహుమతిగా ఇచ్చారని, అందుకు రిటర్న్ గిఫ్ట్ గా ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ రావడంతో వనపర్తి మున్సిపాలిటీ చైర్ పర్మన్‌గా మిడిదొడ్డి మాధవి, వైస్ చైర్మన్‌గా గుర్ర కొండా మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్‌గా అక్కి శ్రీనివాస్ గౌడ్, పరమయ్య గారి సుమిత్రని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని శివసేన రెడ్డి తెలిపారు.






