- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్ బైక్ ఢీ.. వీఆర్ఏ కు గాయాలు
ఆర్టీసీ బస్సును బైకు ఢీ కొన్న ఘటనలో తలకు బలమైన గాయాలకు గురై ఆస్పత్రి పాలైన సంఘటన శనివారం మండల పరిధిలోని రామాపూర్ శివారు లో చోటు చేసుకున్నది.

దిశ, కొల్లాపూర్ : ఆర్టీసీ బస్సును బైకు ఢీ కొన్న ఘటనలో తలకు బలమైన గాయాలకు గురై ఆస్పత్రి పాలైన సంఘటన శనివారం మండల పరిధిలోని రామాపూర్ శివారు లో చోటు చేసుకున్నది. కొల్లాపూర్ డిపో నుంచి AP 29/Z 3429 నంబర్ గల ఆర్టీసీ బస్ పెబ్బేరు కు ప్రయాణికులతో వెళ్తున్నది.పెంట్లవెల్లి కి చెందిన వేంకటేష్ (39)లింగాల మండలంలో వీఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్నాడు. పెంట్లవెల్లి నుంచి బైక్ మీద కొల్లాపూర్ వైపు వెళ్తున్న వెంకటేష్ మార్గం మధ్యలో ఉన్న మాతా శిశువు ఆరోగ్య కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న బస్ ముందు భాగం డీకొన్నాడు. ప్రమాధాన్ని ఊహించని డ్రైవర్ అప్రమత్తమై బస్ ను బ్రెక్ వేయడం తో వెంకటేష్ కు ప్రాణాపాయం తప్పింది. తలకు బలమైన రక్త గాయం కావడంతో కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమి చికిత్స అనంతరం తలకు గాయం కావడం తో డాక్టర్స్ సలహా మేరకు సీటీ స్కానింగ్ కోసం రెఫర్ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.






