- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటరు జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి
జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎలెక్టోరల్ రోల్స్ సవరణలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్ పనులను వేగవంతం చేసి, వచ్చే 20 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎలెక్టోరల్ రోల్స్ సవరణలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్ పనులను వేగవంతం చేసి, వచ్చే 20 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్ శిక్షణ మందిరంలో మహబూబ్ నగర్ అర్బన్ మండల బీఓఎల్ లకు నిర్వహించిన ఆన్-లైన్ ఓటర్ సవరణ ప్రక్రియను ఆమె పరిశీలించి మాట్లాడారు. మహబూబ్ నగర్ అర్బన్ మండలంలో ఇప్పటివరకు కేవలం 38 శాతం మాత్రమే ఓటరు జాబితా మ్యాపింగ్ పూర్తయిందని గుర్తించి, వచ్చే 20 రోజుల్లో కనీసం 80 శాతం వరకు పురోగతి సాధించాలని ఆదేశించారు. బీఓఎల్ లు, సూపర్వైజర్లు కచ్చితంగా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రతి ఇంటిని సర్వే నిర్వహించి 2025 తాజా ఓటరు జాబితాలోని పేర్లను 2002 ఓటరు జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ చేయాలని, లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అదేవిధంగా ప్రోజనీ మ్యాపింగ్‌ను కూడా ఖచ్చితంగా నిర్వహించి నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయాలని, ప్రోజనీ మ్యాపింగ్ కొరకు ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడైనా 2002 ఓటరు జాబితాలో ఓటరు లేదా వారి తల్లితండ్రులు, తాత, అమ్మలు ఉన్నచో అక్కడి బీఓఎల్ లను సంప్రదించి మ్యాపింగ్ చేయించుకోవాలని సూచించారు. సవరణలో భాగంగా ఏవైనా పేర్ల తొలగింపులు లేదా చేర్పులు ఉంటే వాటిని పూర్తి స్థాయి పరిశీలన అనంతరం మాత్రమే నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ ఘన్సీరామ్ నాయక్, ఇతర అధికారులు, బీఓఎల్ పాల్గొన్నారు.






