- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ని చెరువులో మట్టి మాఫియాను అడ్డుకున్న గ్రామస్తులు
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కర్నీ చెరువులో అక్రమంగా తరలిస్తున్న వారిని గ్రామస్తులు ఏకమై రెండోరోజు నిలదీశారు.

దిశ, మక్తల్ : ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కర్నీ చెరువులో అక్రమంగా తరలిస్తున్న వారిని గ్రామస్తులు ఏకమై రెండోరోజు నిలదీశారు. మూడు రోజుల్లోనే కరెక్షన్ తో నల్లమట్టి తరలింపు గ్రామాల పేర్లను కరెక్షన్ చేయడం పై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ఈఈని నిలదీశారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో 100 ట్రిప్పుల నల్ల మట్టిని కర్నే గ్రామ పరిధిలోకి తరలించాలని ఉత్తరేవులు ఉన్నాయి కదా అని నిలదీస్తే గంటలోనే సత్యవార్ గ్రామ పేరును చేర్చి ఉత్తర్వులు జారీ చేశారు.
మట్టి మాఫియాకు వత్తాసు పలకడం పై ఆయన ఇరిగేషన్ అధికారిని రైతుల ముందు ఫోన్ లో నిలదీయడంతో మూడు రోజుల్లో 100 ట్రిప్పులు తరలించాల్సి ఉండగా.. ఒక రోజె వందా ట్రిప్పుల నల్ల మట్టిని జేసీబీ ద్వారా మట్టి మాఫియా తరలిస్తే.. అధికారులు ఎక్కడ ఉన్నారని.. నిబంధనల ప్రకారం చూపించిన దాని కంటే ఎక్కువ విశాలంగా లోతుగా నల్లమట్టిని తీయడం పై సంజాయిషీ ఇవ్వాలని అధికారిని నిలదీశారు. కర్ని గ్రామంలో నల్లమట్టిని తరలించే ఇంత గందరగోళం ఉందంటే వారికి తను ఆర్డర్ ఇచ్చేవాడిని కాదని ఇకముందు ఒప్పంద పత్రంతోనే తను నల్ల మట్టిని తరలించేందుకు సరుకులు జారీ చేస్తా అని గ్రామస్తులతో చెప్పారు.






