రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న 'పల్లెటూరి కుర్రాళ్లు'

by Ratna Kumari |

దిశ, గద్వాల క్రైం : జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన పల్లెటూరి కుర్రాళ్లు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించి జిల్లాకు కీర్తిని తెచ్చింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం

రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న పల్లెటూరి కుర్రాళ్లు
X

దిశ, గద్వాల క్రైం : జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన యువ‌కులు రూపొందించిన‌ 'పల్లెటూరి కుర్రాళ్లు' అనే షార్ట్ ఫిల్మ్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించి జిల్లాకు కీర్తిని తెచ్చింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 2025 అక్టోబర్ 21న నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్ ఫిలిం పోటీల్లో ఈ విజయం దక్కింది. సందేశాత్మక లఘు చిత్రం. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్లే యువకుల నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. “రెకమండేషన్లు కాదు.. రోడ్డు భద్రతా నియమాలే మీ ప్రాణాలను కాపాడతాయి” అనే సందేశాన్ని బలంగా అందించిన ఈ షార్ట్ ఫిల్మ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

డీజీపీ చేతుల మీదుగా బ‌హుమ‌త్రి ప్ర‌దానం

హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో జరిగిన అవార్డు కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా 'పల్లెటూరి కుర్రాళ్లు' టీమ్ సభ్యులు తమ బహుమతిని అందుకున్నారు.ఈ విజయంపై ఎస్పీ టీ. శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్ సభ్యులు ఖదీర్, దేవేందర్, హరిప్రసాద్, రాజు, పరశురామ్ ల‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయంతో జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలో మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది.

Next Story