- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి భూమి ఇచ్చేదే లేదు.. ఎమ్మెల్యేను అడ్డుకున్న బాధితులు
దిశ, జడ్చర్ల : ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కొని తమకు జీవనోపాధి లేకుండా తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని తమ భూముల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు వేయడానికి వెళ్లేదని తమ భూముల మీదుగా ఆర్ఆర్ఆర్ రో

దిశ, జడ్చర్ల : ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కొని తమకు జీవనోపాధి లేకుండా తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని తమ భూముల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు వేయడానికి వెళ్లేదని తమ భూముల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు వేయకుండా అడ్డుకోవాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని బాలనగర్ మండల లో పరిధిలోని పంచాంగుల గడ్డ తండా గిరిజనులు అడ్డుకున్నారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం లోని బాలనగర్ మండల పరిధిలోని జీడి గుడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచాంగుల గడ్డ తండాలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగించుకొని బయలుదేరుతున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని పంచాంగుల గడ్డ తండా బాధితులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి ముందు కదలకుండా అడ్డుకున్నారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తమ గ్రామం మీదుగా రోడ్డు వెళుతుందని పలువురు చెబుతున్నారని అలా రోడ్డు మా గ్రామం మీదుగా వెళితే తమ భూములు కోల్పోయి అనాధలుగా మిగులుతామని పేర్కొంటున్నారు.
కష్టపడి వ్యవసాయం చేసి తమ కుటుంబాన్ని పోషించుకునే భూములను లాక్కుంటే తాము బతికేది ఎలా అని తమ భూముల మీదుగా త్రిబుల్ ఆర్ రోడ్ వెళ్లకుండా అడ్డుకోవాలని ఎమ్మెల్యే ను కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బాలనగర్ మండల పరిధిలోని పంచాంగుల గడ్డ తండా లోని భూముల సర్వే నెంబర్ లేవని అలా సర్వే నెంబర్లు ఏమైనా ఉంటే తాను తాండ ప్రజల పక్షాన ఉంటూ వారి భూములు కోల్పోకుండా తాను ముందుండి పోరాడుతానని అనవసరమైన పుకార్లు నమ్మి మీరు ఆందోళన చెందొద్దని మీ వెంట నేనున్నానని మీ గ్రామం మీదగా రోడ్డు పోకుండా చూసే బాధ్యత తనదని గిరిజనులకు హామీ ఇవ్వడంతో పంచాంగ గడ్డ తండ గిరిజనులు శాంతించారు ఒకవేళ తమ గ్రామం మీదుగా రోడ్డు తీసుకుపోయేందుకు ప్రణాళికలు చేస్తే తాము మాత్రం సెంటు భూమి కూడా ఇవ్వమని ఎమ్మెల్యేకు కరాకండిగా చెప్పారు.






