ప్రమాదపుటంచున కూరగాయల వ్యాపారం

by Chintha Aamani |

నడిరోడ్డు మీద కూరగాయల వ్యాపారం చేస్తూ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బునేడు బాల్ రాజ్ ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రమాదపుటంచున కూరగాయల వ్యాపారం
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: నడిరోడ్డు మీద కూరగాయల వ్యాపారం చేస్తూ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బునేడు బాల్ రాజ్ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని పాత బస్ స్టాండ్ సమీపం నుంచి తిరుమల దేవుని గేట్ వరకు అర కిలోమీటరు దూరం రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముకునే రైతులతో మాట్లాడారు. అసలే ఇరుకైన రోడ్డు, చించోలి, ముంబాయి, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు వెళ్లేందుకు భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు వెళుతుంటాయని, పైగా టిడి గుట్ట దగ్గర ఉన్న రైల్వే గేటు మూసి, తెరిచిన వెంబడే భారీ వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుందని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

కూరగాయల వ్యాపారం మరో చోటకు మార్చుకోవాలని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు ససేమిరా అన్నారు. అనంతరం జిల్లా మార్కెట్ అధికారిణి బాలమణి, మహబూబ్ నగర్ కూరగాయల మార్కెట్ అధికారి కేశవులు లను కలిసి రోడ్డుపైన ప్రమాదకరంగా జరుగుతున్న కూరగాయల వ్యాపారం, ట్రాఫిక్ జాం,వారి భద్రత లపై చర్చించారు. వ్యాపారస్ధులతో చర్చించి చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చినట్లు బాల్ రాజ్ తెలిపారు.

Next Story