రిటైర్డ్ టీచర్ కొండయ్య సార్‌కు నివాళులర్పించిన యూటీఎఫ్ నాయకులు

by Ratna Kumari |

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కుడుముల కొండయ్య మృతి పట్ల టీఎస్‌యుటిఎఫ్

రిటైర్డ్ టీచర్ కొండయ్య సార్‌కు నివాళులర్పించిన యూటీఎఫ్ నాయకులు
X

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కుడుముల కొండయ్య మృతి పట్ల టీఎస్‌యుటిఎఫ్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మరణవార్త తెలిసిన వెంటనే మండల టీఎస్‌యుటిఎఫ్ నాయకులు కొమిరెడ్డిపల్లికి చేరుకుని, కొండయ్య సార్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి, వారి దుఃఖంలో భాగస్వాములయ్యారు. విద్యారంగంలో దీర్ఘకాలం పాటు సేవలందించిన కొండయ్య సార్‌ క్రమశిక్షణ, నిబద్ధత, విద్యార్థుల పట్ల మమకారం అందరికీ ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. ఆయన సేవలు మరిచిపోలేనివని, గ్రామ విద్యాభివృద్ధికి చేసిన కృషి గుర్తుండిపోయేలా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యుటిఎఫ్ మండల అధ్యక్షుడు గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, జిహెచ్ఎం రవిబాబు, హెచ్ఎం సేవియా నాయక్, రమేష్, ఏ.వి. రాములు, విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story