- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సభ్యత్వం కలిగిన వారికి యూనియన్ అండగా ఉంటుంది : పీఆర్టీయూ
దిశ, లోకేశ్వరం : పీఆర్టీయూ యూనియన్ లో సభ్యత్వం ఉన్న ప్రతీ సభ్యుడికి యూనియన్ అండగా ఉంటుందని పీఆర్టీటీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు టి.నరేంద్ర బాబు అన్నారు.

దిశ, లోకేశ్వరం : పీఆర్టీయూ యూనియన్ లో సభ్యత్వం ఉన్న ప్రతీ సభ్యుడికి యూనియన్ అండగా ఉంటుందని పీఆర్టీటీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు టి.నరేంద్ర బాబు అన్నారు. ఇటీవల అకాల మరణం పొందిన పిప్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆర్. నారాయణ భార్య చంద్రకళ, కుమారులకు గురువారం యూనియన్ తరపున సంఘ నాయకులతో కలిసి లక్ష రూపాయలు ఆర్థిక చేయూతను అందించి కుటుంబానికి బాసటగా నిలిచారు. ప్రభుత్వ పరంగా లభించే అన్ని సదుపాయాలు కల్పించేందుకు యూనియన్ తరపున కృషి చేస్తామని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అధైర్య పడకుండా ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు బి.వి.రమణారావు, కండెల రాజేందర్, జే. రాజా రామ్, సురేష్ రావు, భర్ల చిన్నయ్య, అశోక్ రెడ్డి, నర్సింగ్ రావు, వెంకటరమణ ,మురళీధర్ , ముత్తన్న పాల్గొన్నారు.






