భార్య వియోగాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

by Ratna Kumari |

భార్య వియోగాన్ని తట్టుకోలేక భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మరికల్ గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది.

భార్య వియోగాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
X

దిశ, నవాబుపేట : భార్య వియోగాన్ని తట్టుకోలేక భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మరికల్ గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన నడిమింటి శంకరమ్మ అస్వస్థత కారణంగా ఆరు నెలల క్రితం మృతి చెందింది. ఆమె తనను విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక అప్ప‌టి నుంని మదన పడుతూ వచ్చిన ఆమె భర్త నడిమింటి శేఖరయ్య (59) శనివారం తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పొలంలో గల పాలకురిసె చెట్టుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖరయ్య ఉరి వేసుకొని ఉండడం గమనించిన అతడి సోదరుడి కుమారుడు రాఘవేందర్ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు అక్కడికి వెళ్లి పరిశీలించి చూసేసరికే అతడు ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా ఉన్నాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలరు. శేఖరయ్య ఆత్మహత్యకు సంబంధించి ఆయన కుమారుడు మల్లికార్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.

Next Story