‘ఉదండాపూర్’పై కేబినెట్‌లో చర్చించాలి.. సీఎంకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక రిక్వెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కి సంబంధించిన

‘ఉదండాపూర్’పై కేబినెట్‌లో చర్చించాలి.. సీఎంకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక రిక్వెస్ట్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కి సంబంధించిన ఫైలును రాబోయే క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించాల‌ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని గతంలో ప్రకటించాం. కొంత మంది ఇళ్ల‌ నిర్మాణానికి పునాదులు వేసుకున్నారు. వారి వివరాలు ఇందిరమ్మ యాప్ లో అప్ లోడ్ కాకపోవడంతో బిల్లులు ఆగిపోయాయి. ఈ విషయం పై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదికను పంపించామ‌ని.. సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించి బిల్లులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తన తాత దేశ్ముఖ పేరిట రాజపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ఉన్న భూములను రైతులకు ఇచ్చి న్యాయం చేయాలని అక్కడే ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు అని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ:

మొదటి నుం పలు వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు చేస్తూ అధిష్టానాన్ని ఇరకాటంలో పెడుతూ వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ.. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేసినట్లు సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని పలు సందర్భాలలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించిన విషయం పాఠకులకు, రాజకీయ నాయకులు కార్యకర్తలకు తెలిసిందే. ఈ త‌రుణంలోనే ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీ అవ్వ‌డం గ‌మ‌నార్హం.

Next Story