- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి
దిశ, గోపాల్ పేట : వేర్వేరు ఘటనల్లో ఇద్దరూ వ్యక్తులు మృతి చెందిన ఘటన గోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్

దిశ, గోపాల్ పేట : వేర్వేరు ఘటనల్లో ఇద్దరూ వ్యక్తులు మృతి చెందిన ఘటన గోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో ట్రాక్టర్ రొటవెటర్ పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఏదుట్ల గ్రామానికి చెందిన పరుశరాములు, కేతెపల్లి గ్రామానికి చెందిన ఎజ్జురాజ్ కుమార్ (29), ఏదుట్ల గ్రామానికి చెందిన సాయికృష్ణలు కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఈక్రమంలోనే అక్టోబర్ 05న ఎజ్జు రాజ్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్ రొటవేటర్ బ్రేడ్ ని టైట్ చేస్తుండగా.. పరుశరాములు అనే వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ ని ముందుకు కదిలించడంతో రాజ్ కుమార్ రొటవేటర్లో పడి అక్కడికక్కడే మరణించాడు. రాజ్ కుమార్ తండ్రి ఎజ్జు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో..
తాడిపర్తి గ్రామానికి చెందిన పిచ్చుకుంట్ల రాముడు(40) అక్టోబర్ 05న భార్య సువర్ణను మద్యం సేవించడానికి డబ్బులు అడిగాడు. దీంతో భార్య భర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో తాగిన మైకంలో తాడిపర్తి చెరువులోకి దూకాడు. దీంతో సోమవారం ఉదయం కొందరూ చూసి చెరువులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. భార్య సువర్ణ ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. నరేష్ తెలిపారు.






