- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండల పరిధిలో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని ఒకరు..
ప్రయాణిస్తున్న ఆటో నుండి క్రిందపడి మరొకరు మృత్యువాత
దిశ,గోపాల్ పేట: వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండల పరిధిలో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై నరేష్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ధ్యారపోగు రామచంద్రి (41) ఆర్థిక సమస్యలకు తాలలేక తన వ్యవసాయ పొలంలో బుధవారం ఉరివేసుకొని మృతి చెందాడు. అదేవిధంగా మండల పరిధిలోని జయన్న తిరుమలాపురం గ్రామానికి చెందిన కావలి లక్ష్మయ్య జయన్న తిరుమలాపురం నుండి వనపర్తి జిల్లా కేంద్రానికి పాల ఆటోలో వెళ్తుండగా మార్గ మధ్యలో మున్ననూర్ గ్రామంలోని మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో కిందపడిన లక్ష్మయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరుక రెండు ఘటనల్లో మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు.






