రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం.. ఒక‌రికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |   (  Updated:2026-02-01 15:41:49  IST  )

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్ముర‌ణం చెందడంతో పాటు ఒక‌రికీ తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా చార‌కొండ మండ‌ల ప‌రిధిలోని తిమ్మాయిప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం..  ఒక‌రికి తీవ్ర గాయాలు
X

దిశ, చారకొండ: రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్ముర‌ణం చెందడంతో పాటు ఒక‌రికీ తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా చార‌కొండ మండ‌ల ప‌రిధిలోని తిమ్మాయిప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జడ్చర్ల - మిర్యాలగూడ 167 జాతీయ రహదారి పై కల్వకుర్తి వైపు వెళ్తున్న డీసీఎం- జేసీబీ ల వెనుక నుంచి ఓవర్ టేక్ చేసే సమయంలో ముందు డీసీఎం ను ఢీకొని జేసీబీ కి ఢీ కొట్ట‌డంతో బైక్ పై వెళ్ళున్న ముగ్గురి లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాల‌య్యాయి. మృతులు మహేష్ (డిండి చింతపల్లి,) బన్నీ (తెలకపల్లి గౌరారం) తీవ్రంగా గాయపడిన వ్య‌క్తి మ‌స్క రాజ్ కుమార్ తెలుస్తోంది. వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story