మ‌న్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ వద్ద తిరిగి కొనసాగుతున్న టన్నల్ పనులు

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులు ఏడాది తర్వాత ప్రారంభ‌మయ్యాయి.

మ‌న్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ వద్ద తిరిగి కొనసాగుతున్న టన్నల్ పనులు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులు ఏడాది తర్వాత ప్రారంభ‌మయ్యాయి. సరిగ్గా గత ఏడాది ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ ముఖద్వారం దోమల పెంట ప్రస్తుతం పిలవబడుతున్న బ్రహ్మగిరి వద్ద జరిగిన పకృతి విపత్తు కారణంగా సొరంగంలో 14వ కిలోమీటర్ వద్ద అందులో పనిచేస్తున్న ఎనిమిది మంది సజీవమృతి చెందిన సంఘటన రాష్ట్ర, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ పరిణామం లో దాదాపు 40 రోజులకు పైగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు అధికారులు సర్వశక్తుల రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ కేవలం ఇద్దరూ ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే వెలికి తీసి మిగిలిన వారికి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు.

ప‌నులు ప్రారంభించింది ఆరోజు నుంచే..

నవంబర్ 3న సీఎం రేవంత్ పర్యటనతో ఎస్ఎల్బీసీ సంఘ‌ట‌న అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో ఎస్ఎల్బీసీ పనులను తిరిగి ఏ విధంగా ప్రారంభించాలి అందుకు కావాల్సిన నూతన సాంకేతిక పద్ధతులను ఎలా వాడుకోవాలి అని సుదీర్ఘంగా సమాలోచన చేసిన అనంత‌రం గ‌త ఏడాది నవంబర్ 3న అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి ఎస్ ఎస్ఎల్ బీసీ అవుట్ లెట్ వ‌ద్ద సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి దేశ సరిహద్దుల్లో విపత్తు సందర్భాలలో వాడిన టెక్నాలజీని వాడే విధంగా అత్యాధునిక ఎల్బోర్న్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ద్వారా హెలికాప్టర్ తో రైడర్ సర్వే ప్రారంభించి సర్వే పనులు మొదలు కాగా అట్టి పనులు నవంబర్ 12 నాటికి పూర్తి అయింది. అనంత‌రం సర్వేను మొత్తంగా 44 కిలోమీటర్లు చేసిన అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నిపుణులు అందజేశారు. నిపుణుల పర్యవేక్షణ, ఆధునిక టెక్నాలజీతో ప్రస్తుతం సరిగ్గా ఏడాది తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిపుణులైన భారత ఆర్మీ అధికారి మాజీ లెఫ్టినెంట్ జర్నల్ హర్పాల్ సింగ్, కర్నూల్ పరీక్షిత్ మెహ్రా సలహాలు సూచనలతో దాదాపు 30 మంది సొరంగంలో పనులు చేపడుతున్నారు. ఈ పనులను అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెథడ్ ( ఏటీఎం) ద్వారా చేపడుతూ పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పై టెక్నాలజీ ద్వారా ఇన్ పుట్, అవుట్ ఫుట్ SLBC పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినప్పటికీ మొదటగా మన్యవారిపల్లి ఎస్ ఎల్ బి సి అవుట్లెట్ వద్ద సోమవారం నుండి పనులు ప్రారంభించారు.

కన్వీయర్ బెల్ట్ ద్వారా కాకుండా ట్రైన్..

నూతన టెక్నాలజీ తో బ్లాస్టింగ్ చేస్తూ సొరంగ పనులు చేపడుతున్నారు. జేపీ కంపెనీ వారు ఉపయోగించిన కన్వీర్ బెల్ట్ ద్వారా మట్టిని, రాళ్లను బయటికి తొలగించే పనులకు స్వస్తి పలికి. బ్లాస్ట్ అయిన మట్టిని రాళ్లను ట్రైన్ ద్వారా పెద్దపెద్ద బాక్సులలో బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఆదాని కంపెనీ ద్వారా పనులు

ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం కూడా 43.931 కిలోమీటర్లు గాక శ్రీశైలం ప్రాజెక్టు దోమలపెంట ముఖద్వారం వైపు నుంచి 13.9 36 కి.మీ పనులు జరిగాయి. అలాగే మన్నేవారి పల్లి వద్ద ఎస్ ఎల్ బి సి సొరంగంలో జరుగుతున్న పనులు మొన్నటిదాకా 20.4 35 కి.మీ పూర్తి కాగా ఇంకా 9.53 కి.మీ పనులు జరగాల్సి ఉంది. పై పనులను మొత్తం జేపీ కంపెనీ యాజమాన్యం చేపట్టిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం జరుగుతున్న మిగిలిన 9 కిలోమీటర్ల పనులు ఆదాని కంపెనీకి చెందినవారు పనులు ప్రారంభించినట్లు సమాచారం. ఉదయం 7 గంటలకు సొరంగంలోకి వెళ్లిన కార్మికులు నిపుణులు తిరిగి సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తున్నారు. గతం మూడు రోజుల నుండి జరుగుతున్న బ్లాస్టింగ్ మట్టి, బండలను ఈరోజు వరకు బయటకి తీయలేదు. సొరంగంలో జరుగుతున్న పనులపై సంబంధిత ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఫోను ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

Next Story