ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ అధికారుల బదిలీలు

by Ratna Kumari |   (  Updated:2026-02-25 17:38:21  IST  )

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు బ‌దిలీ అయ్యారు.

ఉమ్మడి జిల్లాలో  రెవెన్యూ అధికారుల బదిలీలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెవెన్యూ శాఖ అధికారుల బదిలీలు జరిగాయి. మేడ్చల్ డీఆర్వో గా పనిచేస్తున్న జేఎల్బీ హరిప్రియ ను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెయిటింగ్ లో ఉన్న మరో అదనపు కలెక్టర్ పద్మజారాణి జోగులాంబ గద్వాల డీఆర్ఓగా నియామకం అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా హౌసింగ్ పీడీగా పనిచేస్తున్న టి శ్రీనివాసరావు అదే జిల్లా ఆర్డీవో గా నియామకం కాగా.. ఆర్డీవో గా పని చేస్తున్న అలివేలు హౌసింగ్ పీడీగా నియమితులయ్యారు.

Next Story