వరి ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ

by Nallavelli.Anjaneyulu |

దిశ, వీపనగండ్ల : వ‌రి ధాన్యం కొనుగోలు పై వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యం లో రైతుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వ్యవసాయ, మహిళ సమైక్య, కోఆపరేటివ్ శాఖల

వరి ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ
X

దిశ, వీపనగండ్ల : వ‌రి ధాన్యం కొనుగోలు పై వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో రైతుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వ్యవసాయ, మహిళ సమైక్య, కోఆపరేటివ్ శాఖల సమన్వయంతో వరి కొనుగోలు కేంద్ర ఇన్‌చార్జ్‌లకు వరి నాణ్యత ప్రమాణాలపై సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్ శిక్షణలో భాగంగా సన్న రకాలు, దొడ్డు రకాలను ఎలా గుర్తించాలో చూపించారు. సన్న రకాల వరికి గరిష్టంగా 14 శాతం తేమ శాతం, దొడ్డు రకాల వరికి 17 శాతం తేమ శాతం వరకు మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ వరి ధాన్యాన్ని రైతు వారిగా రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని వివరించారు. ధాన్య నాణ్యత ప్రమాణాలు మట్టి, రాళ్లు గరిష్టంగా 1 శాతం, తాలు, గడ్డి – గరిష్టంగా 1 శాతం, పక్వానికి రాని, కుచించని గింజలు – గరిష్టంగా 3 శాతం, దెబ్బ తిన్న గింజలు – గరిష్టంగా 5 శాతం, ఇతర రకాల గింజలు – గరిష్టంగా 6 శాతం లోపు ధాన్యం ఉండాలి. అప్పుడు మాత్రమే కొనుగోలు జరుగుతుందని వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్ వివరించారు. కార్యక్రమంలో తాసిల్దార్ వరలక్ష్మి, ఏపీఎం మద్దిలేటి,పిఎసిఎస్ సీఈఓ రాము, మండల మహిళా సంఘ అధ్యక్షురాలు ఎత్తం చిట్టెమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Next Story