- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల విధులపై పోలింగ్ అధికారులకు శిక్షణ తరగతులు
by Ratna Kumari |
దిశ, వనపర్తి రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం వనపర్తి లోని బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులు నిర్వహించినట్టు

X
దిశ, వనపర్తి రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం వనపర్తి లోని బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులు నిర్వహించినట్టు వనపర్తి ఎంపీడీవో రవీందర్ బాబు తెలిపారు. ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ ఇచ్చామని.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీల గుర్తులపై ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అలాగే సర్పంచ్, వార్డు మెంబర్లకు పార్టీ గుర్తులు కాకుండా ప్రైవేట్ గుర్తులు ఉంటాయని వెల్లడించారు. వీటి నిర్వహాణపై ఎన్నికల నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు మధ్యాహ్నం వరకే పోలింగ్ జరుగుతుందని తర్వాత ఓట్లలెక్కింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఎక్కడ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంపీడీవో రవీందర్ పోలింగ్ అధికారులకు సూచించారు.
Next Story






