వినాయక నిమజ్జనంలో విషాదం..ట్రాక్టర్ బోల్తా, ఒక‌రు మృతి

by velandi.Saikiran |

శ్రీశైలం డ్యాం వద్దకు గణేష్ ను తీసుకెళ్తున్న‌ ట్రాక్టర్ బోల్తా కొట్టి... ఒక‌రు మృతి చెందాడు. పలువురికి స్వల్ప గాయాలు అయ

వినాయక నిమజ్జనంలో విషాదం..ట్రాక్టర్ బోల్తా, ఒక‌రు మృతి
X

దిశ, అచ్చంపేట: శ్రీశైలం డ్యాం వద్దకు గణేష్ ను తీసుకెళ్తున్న‌ ట్రాక్టర్ బోల్తా కొట్టి... ఒక‌రు మృతి చెందాడు. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి అమ్రాబాద్ మండలం ఈగల పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల వటవర్లపల్లి సమీపంలో ఈ ఘ‌ట‌న గురువారం చోటుచేసుకుంది. ఈగలపెంట ఎస్సై కే జయన్న తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామం నుంచి పది మంది ట్రాక్టర్ ద్వారా గణేష్ నిమజ్జనం చేసేందుకు శ్రీశైలం వెళుతున్న క్రమంలో రాసమల్ల బావి దగ్గర ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కాలిన మహేష్, జల్లి శివప్రసాద్, జల్లి యశ్వంత్, అంగడి, కార్తీక్, ధనుంజయ్ లకు గాయాలయ్యన్నారు. క్షతగాత్రులను 108 ద్వారా అచ్చంపేట ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో కావాలి మహేష్ మార్గమధ్యంలో మృతి చెందాడని ఎస్సై వివరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వలన ట్రాక్టర్ బోల్తా పడ్డట్టు ప్రాథమిక అంచనాకు వచ్చామని, ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story