ట్రాక్ట‌ర్-ఆటో ఢీ.. ఇద్ద‌రు శివ స్వాములు మృతి

by Ratna Kumari |

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులో కల్వకుర్తి - హైదరాబాద్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైలం వెళ్తున్న‌ ఇద్దరు శివ స్వాములు మృతి చెందారు.

ట్రాక్ట‌ర్-ఆటో ఢీ.. ఇద్ద‌రు శివ స్వాములు మృతి
X

దిశ‌, వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులో కల్వకుర్తి - హైదరాబాద్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైలం వెళ్తున్న‌ ఇద్దరు శివ స్వాములు మృతి చెందారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొట్ర గ్రామ శివారులోని కల్వకుర్తి కి సమీపంలో ఉన్న కేసీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో హైద్రాబాద్ - కల్వకుర్తి రహదారిపై హైదరాబాద్ నుండి శ్రీశైలం వెలుతున్న ఆటో, కల్వకుర్తి నుంచి కొట్ర వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు శివ స్వాములు వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం తెల్ల రాళ్లపల్లి తండాకు చెందిన కేతవత్ సురేష్ (30), వికారాబాద్ జిల్లా బొంరాస్పేట్ మండలం ఎరుపుమళ్ళ గ్రామానికి చెందిన కడమంచి సత్యనారాయణ లు మృతి చెందారు. ఆటోలో గ్యాస్ నింపుకోవడానికి కల్వకుర్తి వైపు వెళ్తున్నట్లు సమాచారం. మృత దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు హైదరాబాదు బీరంగూడ లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శివ మాలాధారణ వేసి హైదరాబాద్ శ్రీశైలం వెళ్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు ఎస్సై కురుమూర్తి ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story