- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి కి నిప్పంటించిన దుండగులు..
దిశ, ఊట్కూర్ : గుర్తు తెలియని దుండగులు పత్తి కి నిప్పంటించిన ఘటన ఊట్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

దిశ, ఊట్కూర్ : గుర్తు తెలియని దుండగులు పత్తి కి నిప్పంటించిన ఘటన ఊట్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన మల్లప్ప దాదాపుగా 10 ఎకరాల పైగా పత్తిను సాగు చేశాడు. సాగు చేసిన పత్తిను పొలం లో ఒక దగ్గర సేకరించి పెట్టాడు. గురువారం మహిళలతో తన పొలంలో పత్తిని సేకరించెందుకు పొలం దగ్గరకు వచ్చి వెళ్ళాడు. అయితే మల్లప్ప పత్తి ను అమ్మేందుకు కూలీలను తీసుకురావడానికి మల్లప్ప ఇంటికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే అదే సమయంలో గుర్తుతెలియని దుండగులు పత్తికి నిప్పంటించి పరారైనట్లు అక్కడే ఉన్నవారు గుర్తించారు. పత్తి ఉన్న ప్రదేశంలో పొగలు రావడంతో వెంబడే పత్తి మహిళా కూలీలు దగ్గరికి వెళ్ళగా నిప్పు పెరగడంతో వారు పత్తిని నియంత్రించలేకపోయారు. దాదాపుగా 25 క్వింటాళ్ల వరకు కలిన తరువాత నీటితో మంటలను ఆర్పి వేశారు. పలువురు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించడంతో ఫైర్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నరు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి పత్తి చేతికొచ్చే సమయంలో దుండగులు ఎంత పని చేశారని రైతు కుటుంబ సభ్యులు బోరున కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటన స్థలంలో 40 క్వింటాళ్ల వరకు పత్తి ఉండవచ్చని .. 25 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి అయినట్లు స్థానికులు తెలిపారు.
- Tags
- Cotton






