- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసరడం.. తీవ్రంగా ఖండిస్తున్నా : MLA ఎమ్మెల్యే వంశీకృష్ణ
దిశ, అచ్చంపేట : సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,

దిశ, అచ్చంపేట : సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవై పై ఒక న్యాయవాది బూటుతో దాడి చేయడం సమాజానికి సిగ్గుచేటు అన్నారు. ఇది భారత రాజ్యాంగం పైనే బూటు వేయడం అన్నారు. 75 ఏళ్ల రాజ్యాంగ పాలనలో గవాయి షెడ్యూల్ కేటగిరి నుంచి రెండోసారి దేశానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అది కూడా పూర్తిగా సొంత అర్హతతతోనే అన్నారు. ఈ ఘటన దేశంలోని మొత్తం షెడ్యూల్ కులాలపై దాడిగా చూడాలన్నారు ఎమ్మెల్యే వంశీ కృష్ణ. ఋ ఘటన మూలాన్ని తెలుసుకుని దోషి పై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. రాజ్యాంగాన్ని విశ్వసించే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటన పై ఎదుర్కొనేందుకు ఐక్యంగా పోరాడాలి. భారత దేశ చరిత్ర నుంచి ఈ బ్లాక్ స్పాట ను తుడిచి వేయడానికి మన దేశం కూడా ఐక్యంగా నిలబడాలని ఆయన కోరారు.






