హత్యాయత్నం కేసులో ముగ్గురికి కఠిన కారాగార శిక్ష

by Ratna Kumari |

జిల్లా పరిధిలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లి గ్రామ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో న్యాయస్థానం ముగ్గురు నిందితులకు 4 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, జరిమానా విధించినట్లు ఎస్పీ జానకి తెలిపారు.

హత్యాయత్నం కేసులో ముగ్గురికి కఠిన కారాగార శిక్ష
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా పరిధిలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లి గ్రామ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో న్యాయస్థానం ముగ్గురు నిందితులకు 4 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, జరిమానా విధించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, గ్రామంలో భూవివాదం కారణంగా నిందితులు ఏ 1 ఎరుకలి వెంకటయ్య, ఏ 2 ఎరుకలి శ్రీను, ఏ 3 యెరుకలి మల్లేష్ లు కలిసి బాధితుడు యెరుకలి చెన్నయ్య పై 2023, జనవరి 31 న కర్రలతో దాడి చేసి, కత్తి తో పొడవడం జరిగిందని, ఫిర్యాదు అందుకున్న అప్పటి నవాబుపేట ఎస్ఐ పురుషోత్తం కేసు నమోదు చేసి వెంటనే నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి, విచారణ అనంతరం ముగ్గురు నిందితులకు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, ఒక్కొక్కరు 2 వేల రూపాయల జరిమానా, అలాగే బాధితుడికి ఒక్కొక్కరు 10 వేల చొప్పున మొత్తం 30 వేల రూపాయల జరిమానా చెల్లించాలని మహబూబ్ నగర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఈశ్వరయ్య తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో సమర్థవంతంగా విచారించిన అప్పటి ఎస్ఐ పురుషోత్తం, ప్రస్తుత ఎస్ఐ విక్రం, మొహమ్మద్ అవేజ్, తదితర పోలీస్ సిబ్బందిని ఎస్పీ జానకి అభినందించారు.

Next Story