- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ముగ్గురు మంత్రుల పర్యటనలు
దేవరకద్ర, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలోని మున్సిపాలిటీలలో బుధవారం ముగ్గురు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవి పర్యటించనున్నారు.

దిశ, వనపర్తి/దేవరకద్ర : దేవరకద్ర, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలోని మున్సిపాలిటీలలో బుధవారం ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవి ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవరకద్ర, 2 గంటలకు కొత్తకోట మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు మండలం తోమాల పల్లి గ్రామంలో పర్చువల్ విధానములో విద్యుత్తు ఉప కేంద్రాలను మంత్రులు ప్రారంభిస్తారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో చేపట్టే అభివృద్ధి పనులు, బస్టాండ్ లో సీసీ కెమెరాల పునరుద్ధరణ, పోలీస్ స్టేషన్ సమీపంలో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పెబ్బేరు పట్టణంలో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో గోదాం, కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాలకు వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల బాలికలు, బాలుర వసతి గృహ నిర్మాణాలు, కిచెన్, డైనింగ్ హాల్స్ ను ప్రారంభిస్తారు. ఇదే సందర్భంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదుల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వనపర్తి పట్టణంలోని ఆర్ జి గార్డెన్ లో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాలలో మంత్రులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.






