నా విధి నిర్వహణలో దీనికే మొదటి ప్రాధాన్యం :ఎమ్మెల్యే

by Naveena |

తన ఎమ్మెల్యే విధి నిర్వహణలో విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నా విధి నిర్వహణలో దీనికే మొదటి ప్రాధాన్యం :ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: తన ఎమ్మెల్యే విధి నిర్వహణలో విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలలు,కళాశాల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా వ్యవస్థలో అత్యవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం 'విద్యా నిధి' ఏర్పాటు చేశానన్నారు. ఈ నిధికి తన ఎమ్మెల్యే నెల జీతంలో ప్రతి నెలా లక్ష రూపాయలను విరాళంగా అందజేస్తున్నానని ఆయన తెలిపారు.ఈ నిధి ద్వారా నిర్వహించే విద్యాభివృద్ధి ఉద్దేశ్యాన్ని తెలుసుకొని,హైదరాబాద్ 'మై హోం' అధినేత జూపల్లి రామేశ్వర్ రావు 10 లక్షల రూపాయల చెక్కును,ఆయన కుటుంబ సభ్యుల ద్వారా సోమవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కి అందజేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ విద్యా నిధి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు,రానున్న నాలుగు సంవత్సరాలలో 10 కోట్ల రూపాయలను విద్యా నిధి లో సమకూర్చేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. అలాగే విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారికి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి,రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విద్యార్థులను హన్వాడ మండలం వేపూర్ నుండి,మహబూబ్ నగర్ మండలం మన్యంకొండ నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వరకు తీసుకొచ్చి,తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,సిరాజ్ ఖాద్రీ,జిల్లా మీడియా ఇంచార్జీ సిజె బెనహార్,మాజీ కౌన్సిలర్లు శంకర్,ప్రవీణ్ కుమార్,పురుషోత్తం రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Next Story